Telugu Gateway
Latest News

వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తేశారు

వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తేశారు
X

వుహాన్..ఈ నగరమే ఇప్పుడు ప్రపంచాన్ని లాక్ డౌన్ లోకి నెట్టేసింది. ఇప్పుడు వాళ్లు మాత్రం హాయిగా బయట తిరుగుతున్నారు. కాకపోతే దీనికి వారికి 76 రోజులు పట్టింది. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్సే ఇప్పటికీ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా తోపాటు పలు సంపన్న దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. వైరస్ పుట్టిన వుహాన్ లో కేసులు పూర్తిగా అదుపులోకి రావటంతో అక్కడ లాక్ డౌన్ ఎత్తేయటంతో ప్రజలందరూ బయటకు వచ్చేస్తున్నారు.

1.60 కోట్ల మంది ఉన్న వుహాన్ నుంచి తర్వాత వైరస్ హుబే ప్రావిన్స్ లోకి కూడా పాకింది. దీంతో చైనా ఆ ప్రాంతం మొత్తాన్ని ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేసి వైరస్ పై విజయం సాధించింది. చైనాలో ప్రస్తుతం కేవలం 62 కేసులు మాత్రం ఉండగా..అందులో ఇద్దరు మాత్రం చనిపోయారు.వుహాన్ లోని అతి పెద్ద మాంసపు మార్కెట్ లోనే కరోనా వైరస్ పుట్టినట్లు గుర్తించారు.

Next Story
Share it