రాష్ట్రాలకు 17,287 కోట్లు విడుదల చేసిన కేంద్రం
BY Telugu Gateway3 April 2020 4:17 PM GMT

X
Telugu Gateway3 April 2020 4:17 PM GMT
కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయించారు. పలు రాష్ట్రాలకు మొత్తం 17,287 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ 6195 కోట్లు కూడా ఉంది. ఆదాయ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 57 మంది మరణించారు.
Next Story