Telugu Gateway
Latest News

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్
X

కరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందినా ఆయన శరీరంలోని వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవటం, శరీరంలో వైరస్ లక్షణాలు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఓ అధికారి ప్రతినిధి తెలిపారు. ప్రధాని వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బోరిస్ జాన్సన్ వెంటిలేటర్ పై ఉన్నారంటూ పుకార్లు వ్యాపించాయి. ఆయనకు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉందని కూడా వార్తలు వెలువడ్డాయి.

అయితే వీటిని ఎవరూ ధృవీకరించలేదు. బ్రిటన్ లో కరోనా విజృంభణ ఆగే అవకాశాలు కన్పించటంలేదని చెబుతున్నారు. దీంతో షట్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. బ్రిటన్ లో 24 గంటల్లో 5903 కేసులు పెరిగినట్లు ఆదివారం సాయంత్రం అక్కడి అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య బ్రిటన్ లో 47,806కు పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 621 మంది మరణించారు. బోరిస్ ను ఆస్పత్రికి తరలింపు అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story
Share it