ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో)పై మండిపడుతున్నారు. గతంలో ప్రకటించినట్లుగానే డబ్ల్యుహెచ్ వోకు అమెరికా నిధులు ఇవ్వబోదని మరోసారి స్పష్టం చేస్తూ..నిధులు విడుదలను నిలిపివేశారు. ఈ పరిణామంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రపంచం అంతా ఆరోగ్య సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఏ మాత్రం మేలు చేయదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు.ఈ విపత్కర సమయంలో ఇలాంటి నిర్ణయాలు సహేతుకం కాదని పేర్కొన్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకుంటోందని, ఈ సంస్థ అవసరం ప్రపంచానికి ఎంతైనా ఉందని అన్నారు. జనవరి నెలాఖరులో కరోనా వైరస్ ను పబ్లిక్ ఎమర్జెన్సీగా డబ్యూహెచ్‌వో ప్రకటించింది. అమెరికాలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేయాలంటూ బిల్‌గేట్స్ సహా పలువరు నిఫుణులు కోరినా ట్రంప్ అవేమీ పట్టించుకోలేదు.
డబ్యూహెచ్‌వోకు నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా స్పందించింది. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఈ సమయంలో ట్రంప్ నిర్ణయం ప్రమాదరకరమైనందంటూ అభిప్రాయపడింది. ఈ మేరకు డాక్టర్ ప్యాట్రిస్ హారిస్ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలంటూ సూచించారు. కరోనా కట్టడికి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో చర్చను పక్కదారి పట్టించేందుకే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.