Telugu Gateway
Latest News

రిలయన్స్..ఫేస్ బుక్ ‘బిగ్ డీల్’

రిలయన్స్..ఫేస్ బుక్ ‘బిగ్ డీల్’
X

జియోలో ఫేస్ బుక్ పెట్టుబడి 44 వేల కోట్ల రూపాయలు

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటా తీసుకోనుందని అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇఫ్పుడు ఆ ప్రచారమే నిజం అయింది. ప్రపంచం అంతా కరోనా టెన్షన్ లో ఉన్న సమంయలో రిలయన్స్ జియో, ఫేస్ బుక్ ల మధ్య బిగ్ డీల్ జరిగింది. జియో ఫ్లాట్ ఫామ్స్ లో 9.99 శాతం వాటా కోసం ఫేస్ బుక్ 43,574 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 9.99 శాతం మైనారిటీ వాటా కోసం భారత్ లోకి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) మొత్తం ఇదే కావటం విశేషం. ఫేస్ బుక్ తాజా పెట్టుబడితో జియో ప్లాట్ ఫామ్స్ మొత్తం విలువ 4.62 లక్షల కోట్ల రూపాయలు విలువగా మదింపు చేశారు. జియో ఫ్లాట్ ఫామ్స్ అన్నీకూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి అనుబంధ సంస్థ అన్న సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు తగ్గి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ లో నేలచూపులు చూస్తున్న ఈ తరుణంలో ఈ డీల్ జరగటం కంపెనీకి సానుకూల అంశంగా మారనుంది. రిలయన్స్ జియో ప్రస్తుతం అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటి నుంచో రుణరహిత కంపెనీగా మారేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఫేస్ బుక్ పెట్టుబడి కూడా ఇందుకు దోహదపడే అవకాశం ఉంది. తమ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌, రిలయన్స్‌ కు చెందిన ఈ-కామర్స్‌ వెంచర్‌ జియో మార్ట్‌ తో కలిసి ప్రజలు చిన్న వ్యాపారాలతో కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించనున్నట్లు తెలిపింది. అలాగే దేశంలో డిజిటల్ ఆపరేషన్ లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్‌బుక్‌ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్‌ జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది. వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్ల యూజర్స్‌ ఉన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించేవారిలో 80 శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. 2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లో అగ్రస్థానంలోకి దూసుకు వచ్చింది. మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఈ-కామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది.

Next Story
Share it