లక్ష మృతదేహాల సంచులకు అమెరికా ఆర్డర్
BY Telugu Gateway3 April 2020 5:20 PM IST

X
Telugu Gateway3 April 2020 5:20 PM IST
అమెరికా కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఈ వైరస్ కారణంగా ఆరు వేల మందికిపైగా మరణించారు. ప్రపంచ కరోనా బాధితుల్లో 25 శాతం అమెరికన్లే అని చెబుతున్నారు. గురువారం ఒక్క రోజే అమెరికాలో 1100 మంది మరణించారని జాన్ హప్ కిన్స్ విశ్వవిద్యాలయం చెబుతోంది. వైట్ హౌస్ అంచనాల ప్రకారం అయితే అమెరికాలో కరోనా కారణంగా లక్ష నుంచి రెండున్నర లక్షల మంది మృత్యువాత పడతారని అంచనా వేస్తోంది.
మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ఆ దేశ సైన్యాన్ని కోరింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అమెరికాలో అత్యధిక కేసులు న్యూయార్క్ లో ఉన్న విషయం తెలిసిందే. మాస్క్ లు లేకుండా అసలు ఎవరూ బయటకు రావొద్దని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లేసియో సూచించారు.
Next Story