Telugu Gateway
Latest News

విమాన, రైల్వే ప్రయాణికులకు నిరాశ

విమాన, రైల్వే ప్రయాణికులకు నిరాశ
X

ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి హాయిగా గాలిలో ఎగిరిపోవచ్చు అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కొంత మంది విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే మరికొంత రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ వీళ్లందరికీ నిరాశే ఎదురైంది. ప్రధాని నరేంద్రమోడీ దేశమంతా లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించటంతో దేశంలో చాలా మంది ప్రజలు నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ప్రయాణాలు పెట్టుకున్న వారంతా ఊసురూమన్నారు. అంతే కాదు..మే 3 వరకూ ఎక్కడి వారు అక్కడే అని మోడీ తేల్చేశారు.

ఈ దెబ్బకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మే3 తర్వాత కూడా అడ్వాన్స్ రిజర్వేషన్లు చేయబోమని స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు ఇఫ్పటికే చేసిన బుక్ చేసిన టిక్కెట్ల మొత్తాలను తర్వాత ప్రయాణాలకు వీలుగా సర్దుబాటు చేయనున్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ సర్వీసులపై క్లారిటీ వచ్చేవరకూ ఎలాంటి టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేయకపోవటమే ఉత్తమం అంటున్నారు. ఇప్పుడు అందుకు రైల్వేలు అయితే సిద్ధంగా లేవు. విమానయాన సంస్థలు ఏమి చేస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it