Telugu Gateway
Latest News

దేశీయ విమాన సర్వీసులు మే 4 నుంచి

దేశీయ విమాన సర్వీసులు మే 4 నుంచి
X

ఈ సారి పక్కా. దేశీయ విమాన సర్వీసులు మే 4 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ముందు తొలి దశ లాక్ డౌన్ ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. కానీ కేంద్రం లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం ఎంతో మందిని నిరాశపర్చింది. అయితే సారి మాత్రం ఖచ్చితంగా మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించటం ఖాయం అని చెబుతున్నారు. ఎందుకుంటే ఇప్పటికే విమానయాన పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలా నెలల తరబడి సర్వీసులు నిలిపివేస్తే ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అంతే కాదు..లాక్ డౌన్ తో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇది కూడా ఎంతో మందిని ఇబ్బందికి గురిచేస్తుంది.

ఈ తరుణంలో ఖచ్చితంగా దేశీయ విమాన సర్వీసులు మే 4 నుంచి ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. ఇందుకు సంకేతంగానా అన్నట్లు మే 4వ తేది నుంచి దేశీయ విమానాల టికెట్‌ బుకింగ్‌ ప్రకియ ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని.. జూన్‌ 1 నుంచి అంతర్జాతీయ రూట్లలో బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందిస్తుంటామని ఎయిర్‌ ఇండియా తమ వెబ్‌సైట్‌లో తెలిపింది.

Next Story
Share it