Telugu Gateway
Latest News

వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం

వోడాఫోన్-ఐడియా ఖాతాదారులకు ఆపన్నహస్తం
X

కరోనా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో తన ఖాతాదారులకు ఆపన్న హస్తం అందిందేందుకు వోడాఫోన్-ఐడియా ముందుకొచ్చింది. ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న 100 మిలియన్ల మంది అల్పాదాయ, ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ కల్పించనున్నారు. ఏప్రిల్ 17వ తేదీ వరకూ ఎలాంటి అవరోధాలు లేకుండా ఇన్‌కమింగ్ సేవలను అందించడంతో పాటుగా 10 రూపాయల టాక్ టైమ్ క్రెడిట్‌ను సైతం అందించనున్నట్లు తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఎదురైన అసాధారణ పరిస్థితిలు ఎన్నో కష్టాలను తీసుకువచ్చిన తరుణంలో భారతదేశంలో అగ్రశ్రేణి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) నేడు ఈ దిగువ అంశాలను వెల్లడించింది ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్న అల్పాదాయ వినియోగదారులకు ఏప్రిల్ 17,2020 వరకూ తమ ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ విస్తరణ. ఈ ప్లాన్ వ్యాలిడిటీ విస్తరణ ఉచితంగా చేయడం వల్ల కోట్లాది మంది వోడాఫోన్, ఐడియా వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్‌ ను తమ ప్లాన్ గతంలో ముగిసినప్పటికీ అందుకోగలరు. టాక్ టైమ్ క్రెడిట్‌గా 10 రూపాయలను అందించడం వల్ల దాదాపు 100 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ కస్టమర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను ఈ విపత్కర పరిస్థితిల్లో సైతం కనెక్ట్ అయి ఉంటారనే భరోసాను అందిస్తుంది.

ఎస్ఎంఎస్ మరియు కాల్స్‌ ను చేసుకోవడం దీనిద్వారా సాధ్యమవుతుంది. వీలైనంత త్వరగా అర్హత కలిగిన కస్టమర్లందరికీ ఈ వ్యాలిడిటీ విస్తరణ, టాక్‌టైమ్‌ను అందించనున్నారు. ఈ అంశంపై వోడాఫోన్ ఐడియా మార్కెటింగ్ డైరెక్టర్ అవ్నీష్ ఖోస్లా మాట్లాడుతూ " ఈ కష్టకాలంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా మా కస్టమర్లు తప్పని సరిగా కనెక్ట్ కావాల్సి ఉంది. ప్లాన్ వ్యాలిడిటీ కొనసాగింపు మరియు టాక్ టైమ్ క్రెడిట్ వంటి చర్యలు తప్పని సరిగా వలస కార్మికులు మరియు రోజుకూలీలకు సహాయపడుతుంది. ముందస్తు లాక్ డౌన్ చర్యలు వల్ల తీవ్రంగా వీరు ప్రభావితమయ్యారు. మా నెట్‌వర్క్ బృందాలు ఇప్పటికే 24 గంటలూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎలాంటి క్లిష్టత లేకుండా కనెక్ట్ అయ్యేందుకు భరోసా కల్పిస్తున్నారు''అని అన్నారు.

Next Story
Share it