తెలంగాణలో 36కు చేరిన కరోనా కేసులు
BY Telugu Gateway24 March 2020 1:55 PM IST
X
Telugu Gateway24 March 2020 1:55 PM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం నాడు కొత్తగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. కోకాపేట కు చెందిన 49 సంవత్సరాల వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చింది ఇతను లండన్ నుండి వచ్చాడు. చందా నగర్ కు చెందిన 39 సంవత్సరాల మహిళ జర్మనీ నుండి వచ్చింది ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చారు. బేగంపేటకు చెందిన 61 సంవత్సరాల వృద్ధురాలు సౌదీ అరేబియా నుండి వచ్చింది. ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది.
Next Story