వారంలో ఒక రోజే ఇక సుప్రీంకోర్టు
BY Telugu Gateway23 March 2020 6:43 AM GMT

X
Telugu Gateway23 March 2020 6:43 AM GMT
కరోనా ప్రభావం సుప్రీంకోర్టుపై కూడా పడింది ఇక నుంచి వారంలో ఒక రోజు మాత్రమే సుప్రీంకోర్టు తెరిచి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ప్రకటించారు. ఇది ఇంచుమించు సుప్రీంకోర్టు లాక్ డౌన్ గానే పరిగణించాల్సి ఉంటుంది. మంగళవారం సాయంత్రంలోగా కోర్టులోని లాయర్ల ఛాంబర్లు మూసివేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర తప్ప కొత్త పిటిషన్లు స్వీకరించద్దని సీజె ఆదేశాలు జారీ చేశారు.
Next Story