Telugu Gateway
Latest News

స్టాక్ మార్కెట్లో అదే పతనం

స్టాక్ మార్కెట్లో అదే పతనం
X

దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం ఆగటం లేదు. గత శుక్రవారం తప్ప..మార్కెట్లు భారీగా నష్టపోతూనే ఉన్నాయి. ఈ సోమవారం నాడు ప్రారంభం నుంచే మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఏకంగా సెన్సెక్స్ ఓపెన్ అవటంతోనే 2200 పాయింట్ల నష్టంతోనే ప్రారంభం అయింది. నిఫ్టీదీ అదే దారి. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల షేర్ల ధరలు నేలచూపులే. ప్రధాన షేర్లు కూడా దాదాపు 52 వారాల కనిష్ట స్థాయిల వద్దకు చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ మార్కెట్లో కొత్తగా పెట్టుబడి పెట్టొచ్చా లేదా అన్న భయం మాత్రం ఇన్వెస్టర్లలో నెలకొంది. కరోనా ప్రభావం భారత్ ను వీడటానికి ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. అయితే కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటం దేశంలోని ప్రజలను భయాందోళలను గురిచేస్తోంది.

కరోనా ప్రభావం దేశ పారిశ్రామిక రంగంతోపాటు ఐటి, ఏవియేషన్, ఫార్మా, నిర్మాణ రంగాలపై కూడా పడనుంది. దీంతో ఆయ రంగాలకు వాటిల్లే నష్టం ఏ మేర ఉంటుంది?. కార్పొరేట్ రంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఏ మేరకు ప్యాకేజీలతో ముందుకు వస్తుంది అన్నదే ఇఫ్పుడు ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా భారతీయ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూలేనంత గడ్డు పరిస్థితిని కరోనా కారణంగా ఎదుర్కొంటున్నాయని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి ప్యాకేజీలు ఉంటాయని ప్రకటించారు. కానీ అది ఎప్పుడు..ఎలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

Next Story
Share it