Telugu Gateway
Latest News

స్పైస్ జెట్ పైలట్ కు కరోనా పాజిటివ్

స్పైస్ జెట్ పైలట్ కు కరోనా పాజిటివ్
X

దేశంలో ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశమే స్తంభించిపోయింది. విమానాలే కాదు..రైళ్ళు, బస్సులు కూడా ఎక్కడవి అక్కడే బంద్ అయ్యాయి. ఈ తరుణంలో ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ కు చెందిన పైలట్ ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్నారు. సదరు పైలట్ మార్చి నెలలో ఎలాంటి అంతర్జాయ సర్వీసులు నడపలేదని...కాకపోతే ఆయన చివరిగా మార్చి 21న చెన్నయ్ నుంచి ఢిల్లీకి విమానం నడిపినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది.

ప్రస్తుతం ఆ పైలట్ కు వైద్య సేవలు అందిస్తున్నారు. పైలట్ కు కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న సిబ్బందిని కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యతగా కేంద్రంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఆదివారం సాయంత్రానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 979కి చేరింది. దేశంలో కరోనా మరణాలు 25గా నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 86 మంది రోగులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Next Story
Share it