Telugu Gateway
Latest News

స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత

స్పైస్ జెట్ వేతనాల్లో 30 శాతం కోత
X

దేశంలోని ప్రముఖ చౌక ధరల ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ మార్చి నెల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.. ఎక్కువ వేతనాలు ఉన్న వారికి మాత్రమే 30 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. తక్కువ జీతాలు ఉన్న వారికి మాత్రం ఈ కోత వర్తించదని తెలిపింది. అదే సమయంలో ఒక్క ఉద్యోగిని కూడా తాము తీసేయలేదని వెల్లడించింది. కరోనా వైరస్ దెబ్బకు ఎక్కువ నష్టపోయిన వాటిలో విమానయాన రంగం కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. టాప్ పొజిషన్లలో ఉన్న వారి నుంచి మధ్యశ్రేణి ఉద్యోగుల వరకూ 10 నుంచి 30 శాతం వరకూ కోత విధిస్తున్నారు.

స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ కూడా తన వేతనంలో 30 శాతం కోత పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి 31 వరకూ ఉద్యోగులకు యాజమాన్యం వేతనాలు లేనటువంటి సెలవులో వెళ్లాల్సిందిగా కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఎలాంటి తొలగింపులు లేకుండా ఈ సంక్షోభాన్న అధిగమించగలమని భావిస్తున్నట్లు స్పైస్ జెట్ వెల్లడించింది.

Next Story
Share it