డాక్టర్ కన్నీరు..కదిలిస్తున్న వీడియో

డాక్టర్లు..ఎంతో మంది కన్నీరు తుడుస్తారు. జబ్బుల బారిన పడిన వారికి వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడతారు. అలాంటి డాక్టరే కన్నీరు పెడితే. తన కొడుకు తనను ప్రేమగా హత్తుకునే పరిస్థితి లేకపోతే...ఎవరికైనా ఎంత బాధ అన్పిస్తుంది. ఆ బాధను తట్టుకోలేకే ఆ డాక్టర్ ముఖాన్ని చేతుల్లో దాచుకుని విలవిలలాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా ఎంత..కేవలం తొమ్మిది సెకన్ల వీడియో. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న సేవలు నిరుపమానమైనవి. ప్రపంచం అంతా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంటే డాక్టర్లు మాత్రం రెస్ట్ అనే పదం లేకుండా ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నారు.
సోషల్ మీడియాను కదిలిస్తున్న వీడియో సంగతి ఏంటి అంటే...సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు కరోనా పేషెంట్లకు చికిత్స అందించి తన డ్యూటీ ముగియగానే మెడికల్ సూట్‌లోనే ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే అతని కుమారుడు హుషారుగా లేడిపిల్లలా పరిగెత్తుతూ ఆయన దగ్గరకు వెళ్లాడు. అయితే తండ్రి మాత్రం ఆనందంతో కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దాడలేదు. దగ్గరకు రావద్దు, దూరం జరుగు అంటూ ...అరచేతుల్లో ముఖం పెట్టుకుని కంటతడి పెట్టారు. ఈ వీడియోను ఇప్పటివరకు తొమ్మిది మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
https://www.youtube.com/watch?v=FZzpUL80fYE