స్త్రీ..పురుషులు కలిస్తే పెళ్లి అయినట్లే!

ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా?. ఇలా అయితే ఎంత మందికి అనధికారికంగా పెళ్ళి అయిపోయినట్లే అని లెక్కలు వేసుకుంటున్నారా?. ఆగండి..ఆగండి ఈ రూల్ మన దగ్గర కాదులేండి. కానీ అక్కడ మాత్రం స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అని ఆ దేశ రాజ్యాంగం గుర్తించనుంది. ఈ మేరకు రాజ్యాంగంలో కొత్త సవరణ తీసుకురానుంది. ఈ వివాహాన్ని హెటిరోసెక్సువల్ యూనియన్‌గా గుర్తించినట్లు ఆ దేశ ప్రతినిధులు చెప్పారు. అలాగే దేవుడు అనే పదాన్ని కూడా కొత్త సవరణలతో రాజ్యాంగంలో చేర్చనున్నారు.
ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు సవరణలు ప్రతిపాదిస్తున్నారు. రాజ్యాంగ సవరణల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ 24 పేజీల సవరణలను పార్లమెంట్‌కు సమర్పించారు. మొత్తం సమాజంలోని అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ వచస్లేవ్ వోలోడిన్ తెలిపారు. మరోవైపు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసే ప్రసక్తే లేదని ఇటీవల పుతిన్ స్పష్టం చేశారు. నూతన రాజ్యాంగ సవరణల బిల్లుపై మార్చి 10న పార్లమెంట్‌లో చర్చించనున్నారు. ఏప్రిల్ 22న ఓటింగ్ జరగనుంది.