Telugu Gateway
Latest News

కరోనా దెబ్బకు ఫ్లాట్ ఫాం టిక్కెట్ల మోత

కరోనా దెబ్బకు ఫ్లాట్ ఫాం టిక్కెట్ల మోత
X

కరోనా దెబ్బకు రైల్వే ఓ వింత నిర్ణయం తీసుకుంది. అవసరం లేని వాళ్లు రైల్వే స్టేషన్లలోకి రాకుండా నిరోధించేందుకు ఫ్లాట్ ఫాం టిక్కెట్ల రేట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం పది రూపాయలు ఉన్న ఈ టికెట్ రేట్లను ఒకేసారి 50 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచే ఈ పెంపు అమల్లోకి రానుంది. ‘‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర కొత్త రేట్లను అమల్లోకి వస్తాయి. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.

పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్‌, రట్లాం, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌ స్టేషన్లతోపాటు ధక్షిణ మధ్య రైల్వేలోనూ ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.50కి పెంచాం’’ అని ఓ రైల్వే శాఖ అధికారి తెలిపారు. రైల్వే ప్లాట్‌ఫాం ధరను పెంచేందుకు 2015 మార్చిలో డివిజన్‌ రైల్వే మేనేజర్లకు అధికారం ఇస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Next Story
Share it