Telugu Gateway
Latest News

రాజు అయినా కరోనా డోంట్ కేర్

రాజు అయినా కరోనా డోంట్ కేర్
X

కరోనా కు ఎవరైనా డోంట్ కేర్. అది రాజు అయినా..సామాన్యుడి అయినా ఒకటే. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం. అందుకే ప్రభుత్వాధినేతలు ప్రజలకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. జాగ్రత్త ఒక్కటే మార్గం. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు కరోనా సెగ బ్రిటన్‌ రాజకుటుంబాన్ని తాకింది. ప్రిన్స్‌ చార్లెస్‌(71)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన స్కాట్లాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్‌ హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. చార్లెస్‌ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్‌ వచ్చిందన్నారు. మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు.

Next Story
Share it