Telugu Gateway
Latest News

భారత్ లోకి విదేశీ విమానాలు బంద్

భారత్ లోకి విదేశీ విమానాలు బంద్
X

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ విస్తృతి వేగం పెరగటంతో కేంద్రం కూడా చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ నెల22 నుంచి దేశంలో ఏ ఒక్క అంతర్జాతీయ వాణిజ్య విమానాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఓ వారం పాటు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. దీంతోపాటు పలు నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. 65 సంవత్సరాలు పైబడిన వారు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా ఉండాలని కేంద్రం సూచించింది. పదేళ్ళ లోపు చిన్నారులను కూడా బయటకు పంపొద్దని ఆదేశించారు.

రైల్వేలతోపాటు ఎయిర్ లైన్స్ కూడా అన్ని రాయితీ సౌకర్యాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్ధులు, ఫేషెంట్స్, దివ్యాంగులకు మాత్రం మినహాయింపు కల్పించారు. ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో కూడా వర్క్ ఫ్రం హోం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఆఫీసుల్లో రద్దీని నివారించేందుకు గ్రూప్ బి, సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రత్యామ్నాయ వారాల్లో వచ్చేలా చూడాలని సూచించారు. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

Next Story
Share it