Telugu Gateway
Latest News

దేశీయ విమాన సర్వీసులూ బంద్

దేశీయ విమాన సర్వీసులూ బంద్
X

భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా విమానయాన సంస్థలు తమ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది. ప్రయాణికుల విమానాలకే మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. కార్గో విమానాలు మాత్రమే మామూలుగానే నడుస్తాయి. ఇప్పటికే దేశంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశీయ విమానసర్వీసులకు కూడా బ్రేక్ పడనుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో అటు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇఫ్పటికే 425కి చేరింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ తమ రాష్ట్రాల్లో విమానాలను అనుమతించబోమని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వైరస్ కారణంగా దేశంలో దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయటం అత్యంత అరుదైన అంశంగా పరిగణించాల్సిందే.

Next Story
Share it