Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు
X

చంద్రబాబుది ఆయనది ఒకటే సామాజిక వర్గం

ఎన్నికల కమిషనర్ అనే వాడినే సీఎం చేయవచ్చు కదా?

గవర్నర్ కు ఫిర్యాదు చేశాం..చూస్తూ ఊరుకోం

ఎవడో ఆర్డర్ రాస్తే..ఆయన చదివారు

ఆయనలో మార్పు రాకపోతే ..పై స్థానాల్లో కూడా తీసుకుని పోతాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉరుకునేదిలేదని..అవసరం అయితే ఇంకా పై స్థానాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరకు కూడా దీన్ని తీసుకెళతామని ప్రకటించారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి రాష్ట్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు వాయిదా...రమేష్ కుమార్ నిర్ణయాలపై జగన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ఈ రోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన్ను మేం అపాయింట్ మెంట్ చేసుకున్నది కాదు. తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని చంద్రబాబు నియమించుకున్నారు. ఈ రోజు నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఎన్నికల కమిషనర్ కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. నిష్పాక్షికత. కానీ ఆయన విచక్షణ కూడా కోల్పాయారు. ఆయన బిహేవ్ చేసిన తీరు. ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలు,మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవం అప్పుడే వస్తుంది. అన్నింటి కంటే బాధ ఎక్కడ వస్తుంది అంటే..ఈ రమేష్ కుమార్ కరోనా వైరస్ వల్ల ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నానని చెప్పారు. ఒక వైపు కరోనా వైరస్ సాకు చూపి...అదే ప్రెస్ మీట్ లోనే గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మాచర్ల సీఐతో సహా తప్పిస్తూ ప్రకటన చేస్తారు. నిజంగా నాకు ఆశ్చర్యం అన్పిస్తోంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నీ విచక్షణ ప్రకారం మార్చొచ్చు. ఓ వైపు కరోనా వైరస్ సాకు పెట్టి ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తావు. ఎక్కడ నుంచి నీకు అధికారం వచ్చింది. ప్రజలు ఓట్లు వేస్తే 151 స్థానాలు గెలిపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా అధికారం?. రమేష్ కుమార్ అని చెప్పబడే ఈ వ్యక్తిదా?. ఎన్నికలు అన్నా జరపండి. ఆ పది రోజుల్లో నువ్వు ఏమైనా చేసుకో. గమ్మున ఉంటాం. మేం ఒప్పుకుంటాం. నీ ఇష్టం వచ్చినట్లుగా పోస్ట్ పోన్ అంటాం. నాకున్న విచక్షణాధికారం అంటాం. ప్రతి ఒక్కరు కొత్త పదం నేర్చుకున్నారు. నువ్వే సీఎంగా ఎస్పీలు, కలెక్టర్లను మారుస్తాం. ఇళ్ళ పట్టాలు ఇవ్వొద్దు అంటావు. నాకు ఆశ్చర్యం అన్పిస్తోంది. ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావటం ఎందుకు?. ఎలక్షన్ కమిషనర్ ఎవడైతే ఉంటాడో వాడినే ముఖ్యమంత్రిగా చేయవచ్చు కదా?. నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్ ఇచ్చాడు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఆపాల్సిందేనని మెమో ఇఛ్చారు. పేదోళ్ళకు ఇఛ్చే వాటికి సంతోషపడాల్సింది పోయి..ఆపేయమంటారా?. నిన్నటికి ..ఇవాళ్టికి ఏమి తేడా వచ్చిందో అర్ధం కావటం లేదు. వైసీపీ ఏకగ్రీవంగా స్వీప్ చేయబోతుంది అన్న ఒకే ఒక్క శుభవార్త..వాళ్లకు దుర్వార్తగా వచ్చిన ఘటన తప్ప మరొకటి ఏమీలేదు. చంద్రబాబు దారుణంగా పడిపోతున్నారని..ఏకంగా నాలుగు పేజీల ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ తయారు అవుతున్నట్లుగా..చేసినట్లుగా కానీ ఎలక్షన్ కమిషన్ లో ఉన్న సెక్రటరీ కూడా తెలియదు. ఎవడో రాస్తున్నాడు..ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు. ఈయన చదువుతున్నాడు. ఇలా చేయటం ధర్మమేనా?. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆపేయాలని ఆర్డర్స్ ఇవ్వటం. కరోనా వైరస్ అనే కారణం చూపించి ఎన్నికలుపోస్ట్ పోన్ చేస్తున్నాం..ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరినైనా అడగాలి కదా..సూచనలు కూడా తీసుకోవాలి. హెల్త్ సెక్రటరీని అడగాలి కదా? .

సీఎస్ అభిప్రాయం అడిగారా? రివ్యూ చేసిన పాపాన పోలేదు. నిజంగానే చేయాలనుకుంటున్నాను..పరిస్థితి ఏంటి..మాట్లాడాలి..సలహా తీసుకోవటం ఏమీ లేదు. హెల్త్ సెక్రటరీ కంటే ఎవరైనా సీనియర్ అధికారి ఉంటారా?. ఎన్నికలు వాయిదా వేస్తివి. నువ్వు నీకున్న పవర్ ను కంటిన్యూ చేస్తావు. వాటీజ్ హ్యాపెనింగ్. ప్రజాస్వామ్యంలో ఇదే పద్దతేనా?. చంద్రబాబునాయుడే ఆ పదవి ఇచ్చి ఉండొచ్చు. వాళ్లిద్దరి సామాజికవర్గం ఒకటే కావొచ్చు.ఇది కరెక్టేనా?. ఎన్నికలకు సంబంధించి నానా యాగీ చేస్తున్నారు చంద్రబాబు, ఆయన ను సపోర్ట్ చేసే ఎల్లో మీడియా. చెదురుమదురు ఘటనలు కేవలం 43 చోట్ల మాత్రమే జరిగాయి. ఎందుకు ఈ రాక్షస క్రీడకు పాల్పడటం, నాలుగు పత్రికలు ఎక్కువ ఉన్నాయనే..ఛానళ్లు ఎక్కువ ఉన్నాయనో.. ఎన్నికలు ఏకగ్రీవం కావటం అనేది కొత్తేమీ కాదు. పార్టీ గాలి 151 సీట్లలో వైసీపీ గెలిచింది. ప్రజలు హర్షించదగ్గ పాలన ఇచ్చాం. మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని కార్యరూపం దాల్చాలా చర్యలు తీసుకున్నాం. ఈ ఎన్నికల ప్రక్రియ జరగటం ఎందుకు అంత అవసరం అన్నది ప్రజలు ఆలోచించాలి. మార్చి 31లోపు ఎన్నికలు అయిపోతే 14వ కమిషన్ నిదులు దాదాపు 5000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చే పరిస్తితి ఉంటుంది. ఎన్నికలు జరక్కపోతే డబ్బులు రావు. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడో చోట అభివృద్ధి చేసుకుంటాం కదా?. ఏపీపై ఎందుకింత కక్ష సాధించాలి. ’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it