Telugu Gateway
Latest News

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
X

దేశంలోకి అంతర్జాతీయ విమానాశ్రయాల రాకపై నిషేధం ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. తొలుత మార్చి 31 వరకూ మాత్రమే నిషేధం అని వెల్లడించారు. కానీ దేశమంతా లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకూ పెంచటంతో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కూడా పొడిగించారు. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశంలోకి కరోనా వైరస్ ముఖ్యంగా విదేశాల నుంచే వస్తుండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం విధించటంతోపాటు దేశీయ విమాన సర్వీసులపై కూడా నిషేధం పొడిగించే అవకాశం ఉంది. అప్పటివరకూ కార్గొ విమానాలతోపాటు డీజీసీఏ అనుమతించిన విమానాలు మాత్రమే తిరగనున్నాయి. ఇప్పటికే దేశంలో రైళ్ళు, బస్సు సర్వీసులను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మెట్రో రైల్ సర్వీసులను ఏప్రిల్ 14 వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story
Share it