Telugu Gateway
Latest News

ఫ్లిప్ కార్ట్ సేల్ మళ్ళీ వచ్చింది

ఫ్లిప్ కార్ట్ సేల్ మళ్ళీ వచ్చింది
X

‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో ఫ్లిప్ కార్ట్ సేల్ మళ్ళీ వచ్చింది. మార్చి 19 నుంచి 22 వరకూ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూత పడి ఉన్న తరుణంలో ఈ ఆన్ లైన్ దిగ్గజం సేల్ తో ముందుకు వచ్చింది. ఈ నాలుగు రోజుల ఆన్ లైన్ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌, టీవీలు, అప్లయెన్సెస్‌, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై ఆఫర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ సేల్‌కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్‌ ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్‌లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి.

మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపారు. ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు. ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్‌ ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌ పై 15% తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో బుక్ చేసిన వారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Next Story
Share it