Telugu Gateway
Andhra Pradesh

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు

విజయవాడలో తొలి కరోనా కేసు నమోదు
X

ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్తగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో ఈ కేసుల సంఖ్య ఐదుకు పెరిగినట్లు అయింది. ప్యారిస్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలింది. ఈ వ్యక్తి ఈ నెల 17,18 తేదీల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. 18వ తేదీన జర్వం రావటంతో ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులోనే కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో బాధితుడు నివాసం ఉన్న ప్రాంతంలోని 500 ఇళ్ళలో సర్వే చేసి..టీమ్ తో నిరంతర నిఘాను ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.

అంతే కాకుండా బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన మార్గం, రవాణా సదుపాయాలను గుర్తించి అందరినీ అప్రమత్తం చేశామన్నారు. కరోనా వైరస్ సోకిన బాధితుడిని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్ వెళుతూ ముగ్గురు ప్రయాణికులను తీసుకెళ్ళాడని..ఆ క్యాబ్ డ్రైవర్ ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. ఏపీలో ఇఫ్పటివరకూ 160 మంది శాంపిళ్ళు పరిశీలించగా..అందులో 130 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 25 నమూనాల పరీక్షలు రావాల్సి ఉంది. విజయవాడలో కొత్త కేసు వెలుగు చూడటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.

Next Story
Share it