ఆ దేశాలకు వెళ్లొద్దు..భారత ప్రభుత్వం హెచ్చరిక
BY Telugu Gateway11 March 2020 5:22 AM GMT

X
Telugu Gateway11 March 2020 5:22 AM GMT
భారత ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఆ దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా, ఇటలీ,ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల గురించి ప్రస్తావించింది. అదే సమయంలో అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ప్రపంచంలోని వందకు పైగా దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యాయని పేర్కొంది. దీంతోపాటు దేశంలోకి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు దేశాల్లో విమాన సర్వీసులు కూడా కరోనా దెబ్బకు నిలిపివేశారు.
Next Story