Telugu Gateway
Latest News

చైనాలో కరోనా టెస్ట్ 15 నిమిషాలే..భారత్ లో 24 గంటలు!

చైనాలో కరోనా టెస్ట్ 15 నిమిషాలే..భారత్ లో 24 గంటలు!
X

కరోనా టెస్ట్ కు చైనాలో పట్టే సమయం 15 నిమిషాలు. అదే భారత్ లో అయితే 24 గంటలు. ఒక్క చైనాలోనే కాదు..ఇటలీ, జపాన్ ల్లో కూడా కరోనా టెస్ట్ కు 15 నిమిషాలే పడుతుంది. ఆయా దేశాలు ఈ పరీక్షల కోసం అమెరికాకు చెందిన కంపెనీ బయోమెడిమిక్స్ సిద్ధం చేసిన పద్దతులను ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్ అనుమానితుల నుంచి రక్తం తీసుకున్న పదిహేను నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడిస్తున్నారు ఆయా దేశాల్లో. ఈ పరీక్షల ఫలితాలు 80 శాతం మేర ఖచ్చితమైన సమాచారాన్ని అందించాయని చెబుతున్నారు.

అదే భారత్ లో అయితే ఈ టెస్ట్ ఫలితం రావటానికి ప్రస్తుతం 24 గంటలు పడుతోంది. కరోనా టెస్ట్ ల ఫలితాల కోసం భారత్ లో రివర్స్ ట్రాన్స్కిప్షన్ -పాలిమెర్స్ చైన్ రియాక్షన్ (ఆర్ టీ-సీపీఆర్) అనే మోడల్ ను ఉపయోగిస్తున్నట్లు తాజాగా బహిర్గతమైన నివేదికల్లో తెలిపారు. ఈ మార్గంలో ఫలితం తేలటానికి 24 గంటలు పడుతోందని జాతీయ మీడియాలో వచ్చిన కథనం తెలిపింది. బారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. భారత్ లో ఈ సంఖ్య ప్రస్తుతం 56కు చేరింది.

Next Story
Share it