Telugu Gateway
Latest News

ఎవరి గోల వారిదే..అంతర్జాతీయంగా కండోమ్స్ కొరత

ఎవరి గోల వారిదే..అంతర్జాతీయంగా కండోమ్స్ కొరత
X

ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ తో వణికిపోతుంది. ఎవరు..ఎప్పుడు ఎక్కడ ఈ వైరస్ బారిన పడతారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అందుకే చాలా మంది ఇళ్ళను వీడి బయటకు రావటం లేదు. అందరి నోట ఇప్పుడు ఒకటే నినాదం..ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండండి. చాలా వరకూ ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే అంతర్జాతీయంగా కండోమ్స్ కు కొరత రానుందట. దీనికి కారణం లాక్ డౌన్ లే. ప్రపంచంలోని అతి పెద్ద కండోమ్స్ తయారీ సంస్థగా ఉన్న కారెక్స్ బెర్హాడ్ సీఈవో గో మియా కైత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ మలేషియాలోని మూడు యూనిట్లలో ప్రస్తుతం కండోమ్స్ తయారీని నిలిపివేసింది. అయితే తాజాగా కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు అనుమతి దక్కినా 50 శాతం మంది సిబ్బందితోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే ప్రతి ఐదు కండోమ్స్ లో ఒకటి ఈ సంస్థదే ఉంటుంది. కండోమ్స్ ఎక్కువగా భారత్, చైనాల్లోనే తయారవుతాయని..ఈ రెండు దేశాలు కరోనా మహమ్మారి బారిన పడి అల్లకల్లోలంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతే..డిమాండ్ మాత్రం రెండింతలు అయిందని చెబుతున్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కొంత మంది జంటలు పిల్లల ప్లాన్స్ ను వాయిదా వేసుకుంటున్నాయనని కారెక్స్ ప్రతినిధి వెల్లడించారు. అదే సమయంలో కండోమ్స్ రేటు కూడా భారీగా పెరగనుందని తెలిపారు.

Next Story
Share it