బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్
BY Telugu Gateway27 March 2020 5:11 PM IST

X
Telugu Gateway27 March 2020 5:11 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలియజెప్పే సంఘటన ఇది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిగిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వెంటనే ఆయనకు వైద్య సేవలు ప్రారంభించారు. వెంటనే బోరిస్ జాన్సన్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ వ్యవహారం బ్రిటన్ లో పెద్ద కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు పలు అగ్రదేశాల్లో సైతం కరోనా వైరస్ పెద్ద ఎత్తున విజృభిస్తోంది. సమస్యకు పరిష్కారం బయటకు తిరగకపోవటం, వ్యక్తిగత పరిశుభ్రతతో జాగ్రత్తలు తీసుకోవటమే అని పదే పదే చెబుతున్నారు.
Next Story