Telugu Gateway
Latest News

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే
X

బ్లాక్ ఫ్రైడేలే కాదు..ఇప్పుడు మరో బ్లాక్ మండే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద వేల కోట్ల రూపాయలు అలా క్షణాల్లో మాయం అయిపోతోంది. గత శుక్రవారం నాడు కూడా ఏకంగా 1400 పాయింట్లు నష్టపోయి క్లోజింగ్ లో కొంత రికవరీ అయినా..సోమవారం నాడు మాత్రం మరోసారి భారీ పతనం చవిచూసింది స్టాక్ మార్కెట్. సోమవారం ప్రారంభం నుంచే భారీ నష్టాలు మూటకట్టుకున్న మార్కెట్ ఉదయం 10.45 గంటల సమయానికికి ఏకంగా 1600 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఆ రంగం..ఈ రంగం అన్న మినహాయింపు లేకుండా షేర్లు అన్నీ భారీ నష్టాలు మూటకట్టుకన్నాయి. రియలన్స్ ఇండస్ట్రీస్ షేరు అయితే ఏకంగా 110 రూపాయల నష్టాన్ని మూటకట్టుకుంది.

ఓ వైపు బ్యాంకింగ్ రంగాన్ని యెస్ బ్యాంకు వ్యవహారం కుదిపేస్తోంది. ఈ వ్యవహారం బ్యాంకింగ్ రంగంపై ఖాతాదారులే కాకుండా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కూడా దారుణంగా దెబ్బతీసిందనే చెప్పాలి. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం కూడా ఏ మాత్రం వీడలేదు. దీంతో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఎయిర్ లైన్స్ షేర్లు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. ఈ వరస పతనాలు చూస్తున్న ఇన్వెస్టర్ల స్టాక్ మార్కెట్ పేరు చెపితేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఇవి రికవరీ బాట పడతాయనే అంశాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

Next Story
Share it