Telugu Gateway
Latest News

మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ గుడ్ బై

మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ గుడ్ బై
X

మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్. బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్. ఈ రెండింటి మధ్య బంధం అంతలా పెనవేసుకుపోయింది. అలాంటి బిల్ గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కు గుడ్ బై చెప్పారు. కంపెనీ బోర్డు నుంచి కూడా ఆయన వైదొలిగారు. బిల్ గేట్స్ 2014లోనే కంపెనీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 1975లో బిల్ గేట్స్ పాల్ అలెన్ తో కలసి మైక్రోసాఫ్ట్ ను నెలకొల్పారు. గేట్స్ తాజాగా మైక్రోసాఫ్ట్ తోపాటు బెర్క్ షైర్ హాత్ వే బోర్డుల నుంచి ఆయన తప్పుకున్నారు. అయితే ఆయన సంస్థ సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. సేవా కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్ ద్వారా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపడతారన్నది తెలిసిన విషయమే.

విద్య, పర్యావరణ మార్పులు వంటి అంశాలపై బిల్ గేట్స్ ఫోకస్ పెట్టనున్నారు. మైక్రోసాఫ్ట్, బెర్క్ షైర్ లు గతంలో ఎన్నడూలేనంత పటిష్టంగా ఉన్నాయని...అందుకే తాను బోర్డు నుంచి వైదొలగటానికి ఇదే సరైన సమయం అని భావించినట్లు పేర్కొన్నారు. బోర్డు నుంచి బిల్ గేట్స్ తప్పుకోవటంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలసి పనిచేయటం గొప్ప గౌరవం భావిస్తున్నానని పేర్కొన్నారు. సాప్ట్ వేర్ ప్రయోజనాలను ప్రజలకు మరింత దగ్గర చేసి సమాజంలో సవాళ్లను పరిష్కరించాలన్న లక్ష్యంతోనే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ స్థాపించారని వ్యాఖ్యానించారు.

Next Story
Share it