బ్యాంకులు..ఏటీఎంలు పనిచేస్తున్నాయ్
BY Telugu Gateway30 March 2020 6:49 PM IST

X
Telugu Gateway30 March 2020 6:49 PM IST
కరోనా భయంతో బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. పలు జాగ్రత్తలు తీసుకుంటూనే బ్యాంకు సిబ్బంది పనిచేస్తున్నారని..ఏటీఎంల్లో కూడా ఎప్పటికప్పుడు నగదు పెడుతున్నారని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులూ తెరిచిఉన్నాయని, ఏటీఎంలు పనిచేస్తున్నాయని అన్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారని, అవసరమైన చోట శానిటైజర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. బ్యాంక్ బ్రాంచ్లను మూసివేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని ఎస్బీఐ ఎండీ సైతం ఈ ప్రచారాన్నితోసిపుచ్చారు.
Next Story