మార్చి 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్ళు బంద్
BY Telugu Gateway22 March 2020 2:14 PM IST
X
Telugu Gateway22 March 2020 2:14 PM IST
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకూ ఇది అమల్లో ఉండనుంది. భారతీయ రైల్వేలు, కొంకణ్ రైల్వేల్లో ఇది అమలు కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు నడిచే అన్ని ప్యాసింజర్ రైళ్లతోపాటు ఇంటర్ సిటీ రైళ్లు కూడా రద్దు అయ్యాయి.
అయితే గూడ్స్ రైళ్లు మాత్రం మామూలుగానే నడుస్తాయి. అయితే సబర్భన్ రైళ్ళు, మెట్రో రైళ్లను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతించే అవకాశం ఉందని సమాచారం. పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు వీటి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Next Story