కేంద్ర బడ్జెట్...ధరలు తగ్గేవి ఇవే

బడ్జెట్ అంటేనే పన్నుల పెంపు, తగ్గింపు. ప్రతి బడ్జెట్ లోనూ ఇది సర్వసాధారణమే. ఈ మార్పుల ఆధారంగానే ఆయా వస్తువుల ధరల్లో పెరుగుదుల, తగ్గుదల ఉంటుంది. అందుకే కేంద్ర బడ్జెట్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. అందులో భాగంగానే ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరగనున్నాయి.
వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. ఇది ప్రింట్ మీడియాకు ఊరట కల్పించే అంశం. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. బడ్జెట్ ప్రకటనతో ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి..ఏవి పెరగనున్నాయో ఓ సారి ఈ జాబితా చూడండి.
ధరలు తగ్గేవి
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
ఎలక్ట్రిక్ వాహనాలు
మొబైల్ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు
ధరలు పెరిగేవి
ఫర్నీచర్
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్
స్టీలు
కాపర్
సోయా ఫైబర్, సోయా ప్రోటీన్
కమర్షియల్ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్ మిల్క్
వాల్ ఫ్యాన్స్
టేబుల్‌వేర్