Telugu Gateway
Latest News

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
X

వడ్డీ రేట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తన పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత రేట్లనే కొనసాగించింది. రెపో రేటు. 5.15 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటును 4.90 శాతం వద్దే ఉంచింది. గురువారం ముగిసిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్ బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ కమిటీ రేట్లు యథాతథంగా ఉంచడానికే ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి రివ్యూ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికం కోసం సీపీఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 6.5 శాతానికి సవరించినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ మీడియాకువివరించారు. ఇది 2020-21 మొదటి అర్ధభాగానికి 5.4-5.0 శాతం, 2020-21 మూడవ త్రైమాసికంలో 3.2 శాతం లక్ష్యాన్ని కూడా నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కరోనా వైరస్‌ తదితర పరిణామాల నేపథ్యంలో యథాతయథానికి మొగ్గు చూపినట్టు కమిటీ వ్యాఖ్యానించింది. ఆర్ బిఐ తాజా నిర్ణయం రియల్‌ రంగానికి భారీ ఊరట కల్పించిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.

Next Story
Share it