Telugu Gateway
Latest News

అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా?

అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా?
X

అసలు విదేశాల్లో ఎంత భారతీయులు నివశిస్తున్నారు?. అందులో ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అనే అంశాలను తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ లోక్ సభ ముందు పెట్టింది. ఈ సమాచారం విదేశాల్లో నివశిస్తున్న భారతీయుల సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా తేల్చారు. ఈ గణాంకాలను విదేశీ వ్యవహారాల శాఖ డేటానే. అయితే ఎక్కువ మంది భారతీయులు నివశిస్తున్నది మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోనే. ఇక్కడ ఏకంగా 34.20 లక్షల మంది ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. యూఏఈలోనూ ఒక్క సౌదీ అరేబియాలోనే 25.94 మంది నివశిస్తున్నారు. అమెరికాలో నివశిస్తున్న భారతీయుల సంఖ్యను 12.80 లక్షలుగా విదేశాంగ శాఖ వెల్లడించింది.

కువైట్ లో 10.29 లక్షలు, ఓమన్ లో 7,79,351 మంది, ఖతార్ లో 7,56,062, నేపాల్ లో 5,00,000, యునెటైడ్ కింగ్ డమ్ (యూకె)లో3,51,000, సింగపూర్ లో 3,50,000, బహ్రెయిన్ లో 3,23,292ల మంది నివశిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు చేరిన వారే. కొంత మంది వృత్తినిపుణులతోపాటు వ్యాపారులు కూడా ఉంటారు. ఎంత మంది అసలు భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు..ఎక్కువ మంది ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అన్న వివరాలను లెక్కల వారీగా లోక్ సభ ముందు పెట్టారు.

Next Story
Share it