Telugu Gateway
Latest News

కాశ్మీర్ అంశాన్ని మోడీ చూసుకోగలరు

కాశ్మీర్ అంశాన్ని మోడీ చూసుకోగలరు
X

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి తాను ప్రధాని మోడీతో చర్చించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ అంశంపై అల్లరు..ఆందోళనల గురించి విన్నానని..అయితే అవి భారత్ అంతర్గత అంశాలు అన్నారు. అదే సమయంలో కాశ్మీర్ గురించి ప్రధాని మోడీ చూసుకోగలరని అన్నారు. ప్రధాని మోడీ చాలా ధృడమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన కోసం బారత్ కు వచ్చిన ట్రంప్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మత స్వేచ్ఛపై ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో తాము చర్చించామని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. మతస్వేచ్ఛపై ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో బారత్ లో 14 కోట్ల మంది ఉన్న ముస్లింల సంఖ్య ఇఫ్పుడు 20 కోట్లు దాటిందని మోడీ వెల్లడించినట్లు తెలిపారు. ముస్లింలకు స్వేచ్చ, రక్షణ ఉందనేందుకు ఇదే నిదర్శనం అని వెల్లడించారన్నారు.

ఇంథన రంగంలో అమెరికా, భారత్ ల మైత్రి విస్తరించనుందని తెలిపారు. భారత్ తో వాణిజ్య ఒప్పందాల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. భారత్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలపై అమెరికాలో సుంకాలు లేవు కానీ..అమెరికా నుంచి వచ్చే వాహనాలపై మాత్రం భారత్ భారీగా పన్ను వేస్తుందని ట్రంప్ తెలిపారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాము ఉగ్రవాదంపై పోరాడుతున్నాం తప్ప..అమాయకులను మాత్రం ఎక్కడా టార్గెట్ చేయలేదన్నారు. రెండు రోజుల భారత పర్యటనకు తనకు ఎంతో సంతృప్తిని,,ఆనందాన్ని మిగిల్చిందని తెలిపారు.

Next Story
Share it