Telugu Gateway
Latest News

విమానంలో కూర్చుని ప్లాస్టిక్ కవర్లు కప్పుకుని..!

విమానంలో కూర్చుని ప్లాస్టిక్ కవర్లు కప్పుకుని..!
X

అంతర్జాతీయ పర్యటన అంటేనే ఇప్పుడు అందరికీ వణుకే. అత్యవసరం అయితే తప్ప ఎవరూ విమానం ఎక్కటానికి కూడా ఆసక్తి చూపటంలేదు. ముఖ్యంగా విదేశీ పర్యటనలు అంటే హడలిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే భయం. దీంతో పర్యాటక రంగం పడకేసింది. విమాన సంస్థలు కూడా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోనున్నాయి. ఓ వైపు సర్వీసులు కుదించుకుంటున్నా నష్టాలు తప్పేలా లేవు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రయాణికులు ఎంత భయంతో వణికిపోతున్నారే చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలో విమానం ఎక్కిన ఓ జంట తమ సీట్లలో కూర్చోగానే తమంతట తాము ప్లాస్టిక్ బ్యాగులతో కవర్ చేసుకున్నారు. మాస్క్ లు వేసుకోవటంతో పాటు బాడీలో సగం బాగం కవర్ అయ్యేలా ప్లాస్టిక్ తో కవర్ చేసుకున్న అంశాన్ని వెనక సీటులో ఉన్న అల్సా అనే యువతి వీళ్ళ సీటు వెనక కూర్చుని వీడియో తీసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్ గా మారిపోయింది. కరోనా వైరస్ (కోవిడ్ 2019)కు ఎంత భయపడుతున్నారో ఈ సంఘటన తెలియజేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇఫ్పటికే 2300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇందులో అత్యధిక మంది చైనాలోనే. అయితే విమానంలోని జంట ప్లాస్టిక్ తో నే బాడీని కవర్ చేసుకోవటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు కప్పుకున్న వాళ్లు కూడా విమానంలో మిగిలిన ప్రయాణికులు పీలుస్తున్న గాలినే పీల్చుతున్నారు కదా అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోకరు అయితే దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ కే వైరస్ ఉంటే ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. అయితే కొంత మంది మాత్రం ఆ ప్లాస్టిక్ ఉక్కపోతతో వారు చనిపోకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో 15 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇవి అన్నీ కూడా వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ తో అనుసంధానం అయిన వారి విషయంలోనే ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=0KHOrlifzBw

Next Story
Share it