Telugu Gateway
Latest News

విమానం టేకాఫ్ తర్వాత ఊడిన టైరు...షాకింగ్ వీడియో

విమానం టేకాఫ్ తర్వాత ఊడిన టైరు...షాకింగ్ వీడియో
X

విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ సమయంలోనే టైర్ల దగ్గర కొద్దిపాటి మంటలు వచ్చాయి. టేకాఫ్ అయిన తర్వాత ఓ టైరు ఊడిపడిపోయింది . ఈ సంఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ కు చెందిన విమానం మాంట్రియల్ లోని ట్రుడేయు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైర్ ఊడిపోయిన విషయం తెలియటంతో వెంటనే ఆ విమానాన్ని వెనక్కి రప్పించి సురక్షితంగా ల్యాండ్ చేయించారు.

ఈ 8684 విమానం బొగొటివిల్లికి బయలుదేరింది. ఇందులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు.ఇదే విమానానికి చెందిన ఎడమ వైపున ఉండే మెయిన్ ల్యాండ్ గేర్ కు ఉండే టైరు ఉడిపోయింది. ఈ విమానంలో అత్యంత నైపుణ్యం గల పైలట్లు ఉండటంతో ఓ టైరు లేకపోయినా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ వాహనాలను కూడా విమానాశ్రయంలో సిద్ధం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో ప్రయాణికులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

https://www.youtube.com/watch?v=w1xLqqvpu_4

Next Story
Share it