Telugu Gateway
Latest News

‘కొత్త శిఖరాలకు’ స్టాక్ మార్కెట్లు

‘కొత్త శిఖరాలకు’ స్టాక్ మార్కెట్లు
X

దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి బ్రేక్ పడినట్లే అని వార్తలు రావటంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో ముంబయ్ స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెన్సెన్స్ తొలిసారి 42 వేల పాయింట్లను అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్ఎస్ఈ సూచి కూడా 12,380 పాయింట్లకు తాకి జీవిత కాల గరిష్టానికి చేరింది. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో పలు షేర్లు దూసుకు వెళుతున్నాయి.

దేశంలో ఆర్ధిక మందగమన పరిస్థితులు ఉన్నాయనే అంచనాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు మాత్రం దూకుడు ప్రదర్శించటం విశేషం. గురువారం నాడు డాలర్ తో రూపాయి మారకం విలువ 70.71 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు ఉండటంతో దేశీయ మార్కెట్లో జోష్ కొనసాగుతోంది.

Next Story
Share it