Telugu Gateway
Latest News

షాకింగ్ న్యూస్..భారీ ఎత్తున రెండు వేల ఫేక్ నోట్లు

షాకింగ్ న్యూస్..భారీ ఎత్తున రెండు వేల ఫేక్ నోట్లు
X

కొత్త రెండు వేల నోట్లు అత్యంత సురక్షితం. వాటిని పోలిన నోట్లు తయారు చేయటం అంత సులభం కాదు. దేశంలోకి భారీ ఎత్తున వస్తున్న ఫేక్ కరెన్సీని అడ్డుకట్ట వేసేందుకే కొత్త నోట్లు తెస్తున్నాం. ఇవీ మోడీ సర్కారు పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చేసిన ప్రకటనలు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ భారీ ఎత్తున రెండు వేల రూపాయల ఫేక్ నోట్లు దొరకటం కలకలం రేపుతోంది. గుజరాత్ కేంద్రంగా భారీ ఎత్తున రెండు వేల రూపాయల ఫేక్ నోట్లు దొరికినట్లు అధికారిక సమాచారం. మరి ఈ పరిణామాలను కేంద్రం ఎలా సమర్ధించుకుంటుందో వేచిచూడాల్సిందే. తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే రెండు వేల రూపాయల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తాజాగా తేలింది. దేశంలో హల్‌ చల్‌ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అందించిన డేటా ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత 56 శాతం రూ .2 వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి.

దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని ఈ డేటా వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీపట్టుబడి, గుజరాత్‌ ఫేక్‌ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా తెలుస్తోది. 2016, నవంబర్ 8న రూ .1000, రూ .500 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, అవినీతి, నకిలీ నోట్లు, నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. భారతదేశంలో నకిలీ కరెన్సీపై తాముఈ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలకు తమకు సహకరించాలనీ ​ కోరిన సంగతి తెలిసిందే. మరి కేంద్రం వీటిని అరికట్టేందుకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it