Telugu Gateway
Latest News

కరేబియన్ దీవుల్లో భూకంపం..సునామీ హెచ్చరికలు

కరేబియన్ దీవుల్లో భూకంపం..సునామీ హెచ్చరికలు
X

ఒక్కసారిగా పార్క్ చేసి ఉన్న కార్లు అన్నీ ఊగిపోయాయి. ఎవరో కదిలిస్తున్నట్లు అటు ఇటు జరిగాయి. రోడ్లకు బీటలు. పెద్ద పెద్ద శబ్దాలు. కారణం భూ కంపం. అది కూడా రిక్టర్ స్కేల్ పై 7.7 శాతంగా నమోదు. దీంతో ప్రజలు అందరూ ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగు పరుగున బయటకు వచ్చారు. కరేబియన్‌ దీవుల్లో భూకంపం తో పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది.

జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది.

Next Story
Share it