Telugu Gateway
Latest News

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న డైరక్టర్ అరెస్ట్

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న డైరక్టర్ అరెస్ట్
X

సినీ పరిశ్రమ అంటే అదో రంగుల లోకం. ఆ రంగుల లోకంలో మాయలు ఎన్నో..మోసాలు ఎన్నో. ఎలాగైనా సినిమాల్లో కన్పించాలనే తపనతో అటువైపు చూసే అమ్మాయిలు..అబ్బాయిలు కోకొల్లలు. ఇలా వచ్చి మోసపోయే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అమ్మాయిల సినీ అవకాశాల వీక్ నెస్ ను కొంత మంది తమను అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశాలు ఇప్పిస్తామని కొంత మంది అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. తాజాగా ముంబయ్ లోని బాలీవుడ్ కు చెందిన కాస్టింగ్ డైరక్టర్ చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సినిమా నటులు..మోడల్స్ కు ఎంత మొత్తం అయినా చెల్లించటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొంత మంది ఈ దందా సాగిస్తున్నారు. ముంబయ్ లో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సినీ అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన అతను.. అతని స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందా ప్రారంభించారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి.. వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాకు పోలీసులు తాజాగా చెక్ పెట్టారు. నవీన్‌ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిన పోలీసులు కస్టమర్‌లా నవీన్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్.. ఇండస్ట్రీలో మోడల్‌గా, ఆర్టిస్ట్‌ గా పనిచేస్తోన్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చారు. అయితే.. ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పారు. పోలీసులు అందుకు అంగీకరించడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ దందాకు పోలీస్ లు చెక్ పెట్టారు.

Next Story
Share it