‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ సేల్ మళ్లీ వచ్చింది

ఆఫర్లే ఆఫర్లు. నిన్న..మొన్నటి వరకూ సంక్రాంతి ఆఫర్లు. పండగ ముగిసింది కానీ..ఆఫర్ల పండగ మాత్రం కొనసాగుతూనే ఉంది. సహజంగా చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త వస్తువులు కొనటానికి ఆసక్తిచూపుతుంటారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులతో హవా ఎక్కువ ఉంటుంది ఆఫర్లు కూడా వీటిపైనే ఎక్కువ ఉంటాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ‘గ్రేట్ ఇండిన్ సేల్’తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్లు జనవరి 19 నుంచి 22 వరకూ కొనసాగనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్-2020 పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. తర్వాత రోజుల్లో దీన్ని అందరికీ విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది.
కొన్ని స్మార్ట్ ఫోన్లపై 40శాతం దాకా, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10,000 దాకా ప్రత్యేక తగ్గింపు దొరకనుంది. దీంతోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అదనం. వన్‌ప్లస్ 7టీ, వన్‌ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్‌మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఒప్పో ఎఫ్ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్ ధరలో లభించనుంది. ప్రస్తుత సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ తో పాటు ఇతర సంస్థలు కూడా ఈ ఆఫర్ల రేస్ లోకి రావటం ఖాయంగా కన్పిస్తోంది.