Telugu Gateway
Latest News

అమ్మాయిలూ అశ్లీల వీడియోలు చూస్తున్నారు

అమ్మాయిలూ అశ్లీల వీడియోలు చూస్తున్నారు
X

అశ్లీల వీడియోలు అనగానే అందరూ మగవాళ్ల వైపే అనుమానంగా చూస్తారు. ఎందుకంటే వాళ్లే ఎక్కువ ఈ వీడియోలు చూస్తారనే నమ్మకం. ఇందులో చాలా వరకూ నిజం లేకపోలేదు. అయితే తాజాగా వెలుగు చూసిన అంశాలు షాకింగ్ గా ఉన్నాయి. ఈ వీడియోలు చూసే వారి జాబితాలో అబ్బాయిలే కాదు..మహిళలూ ఉన్నారు. వారి వయస్సు వంటి వివరాలు ఏమీ లేవు కానీ..అమ్మాయిలు కూడా ఈ వీడియోలు చూస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇంకో విశేషం ఏమిటంటే దేశంలోనే పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య భారత్ లోనే ఎక్కువ అని ఓ సర్వే నిగ్గుతేల్చింది. చెన్నయ్ పోలీసులు అయితే తరచూ అదే పనిగా అశ్లీల వీడియోలు చూస్తుంటే కేసులు కూడా పెడతామని హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియోల వీక్షణ కూడా మహిళలపై దాడులకు కారణం అవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. దీన్ని అరికట్టే దిశగా పక్కాగా చర్యలు ప్రారంభించారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్‌ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించటం కలకలం రేపుతోంది.

Next Story
Share it