Telugu Gateway
Latest News

కోరుకున్న వారితో శృంగారం!

కోరుకున్న వారితో శృంగారం!
X

వెర్రితలలు వేస్తున్న టెక్నాలజీ

త్రీ డీ అవతార్స్ తో కొత్త చిక్కులు

సెలబ్రిటీలే ఎక్కువ మంది టార్గెట్

విచ్చలవిడిగా ఫోటోలు షేర్ చేస్తే తిప్పలు తప్పవు

షాకింగ్ న్యూస్ ఇది. అమ్మాయిలూ బహుపరాక్. ఇష్టానుసారం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడాల్సిన సాంకేతిక పరిజ్ణానం కొంత మంది వల్ల దారితప్పుతోంది. ఇప్పటికే ఎన్నో వెర్రితలలు వేసిన ఈ టెక్నాలజీ మరింత వికృత రూపం దాల్చుతున్నట్లు తాజాగా వెల్లడైన కథనాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దీని బారిన ఎక్కువ పడుతున్నట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. త్రీడీ అవతార్స్ తో కొంత మంది తమ మాజీ ప్రియురాళ్ళు, సెలబ్రిటీలతో తమ శృంగార కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణిగా మారబోతోంది. తాము కోరుకున్న అమ్మాయిలు..సెలబ్రిటీలకు చెందిన హై క్వాలిటీ ఫోటోల ఆధారంగా త్రీడీ అవతార్స్ తయారు చేయించుకుని వాటితో శృంగార కార్యకలాపాలకు కొంత మంది పాల్పడుతున్నారు.

దీన్ని నియంత్రించటం కూడా ఇప్పట్లో కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పనులు చేసే వారికి నైతికం..అనైతికం అనే అంశాలకు పోరు అన్న విషయం తెలిసిందే. తమ ఫాంటసీలను తీర్చుకునేందుకు చాలా మంది ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. అంటే ఇంచుమించు తాము కోరుకున్న వారితో ఇలాంటి మార్గాల ద్వారా తమ శృంగార కాంక్షలను తీర్చుకుంటున్నారన్న మాట. త్రీడీ గ్రాఫిక్స్ హాబీయిస్ట్ లు కొంత మంది కోరిక మేరకు ఒరిజినల్ ఫోటోలతో కూడిన ఇలాంటి త్రీడీ అవతార్ లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అంతే కాదు..వాళ్ల వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఈ త్రీడీ అవతార్ లకు జుట్టు, వక్షోజాలను కూడా డిజైన్ చేసి మరీ ఇస్తారు. ఇలా తయారు చేసిన వాటితో ఆయా వ్యక్తుల అనుమతి అనే అంశంతో సంబంధం లేకుండా వర్చువల్ రియాలటీతో సెక్స్ నిర్వహించవచ్చని నివేదికలు తేల్చాయి. ఇలా వరిజినల్ ఫోటోలతో కూడిన త్రీడీ అవతార్స్ కోరే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయిందని చెబుతున్నారు.

ఇలా త్రీడీ అడల్ట్ కంటెంట్ తయారీ కోసం పలు సంస్థలు పనిచేస్తున్నాయి. Virt-A-Mate అనే సంస్థ తయారు చేసిన త్రీడీ అడల్ట్ కంటెంట్ తో తన మాజీ గర్ల్ ఫ్రెండ్ సెక్స్ వల్ ఫాంటసీలు అన్నీ పూర్తి చేసుకున్నట్లు ఓ వినియోగదారుడు తెలిపారు. మరి కొంత మంది అయితే దారుణంగా తమ గర్ల్ ఫ్రెండ్స్ ను వివిధ భంగిమల్లో ఫోటోలు దిగమని అడిగి ఇలాంటి వాటి ద్వారా తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఇండియా కూడా తాజాగా ఓ కథనాన్ని ఇచ్చింది. ‘మీతోఎవరు సెక్స్ చేస్తున్నారో మీకు తెలియదు’ అనే హెడ్డింగ్ తో ఈ స్టోరీని ప్రచురించింది. ఇది అంతా కూడా 3డ్రీ అవతార్స్ రూపంలో ముంచుకొస్తున్న ముప్పుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ఎవరైనా చేయగలిగింది ఏమానా ఉంది అంటే ముఖ్యంగా యువతులు, మహిళలు తమ ఫోటోలను బహిరంగంగా అందుబాటులో లేకుండా చేయటం తప్ప మరో మార్గంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి వాటితో ఎక్కువగా సెలబ్రిటీలకే చిక్కులు వస్తాయని చెబుతున్నారు.

Next Story
Share it