Telugu Gateway
Latest News

స్టాట్యూ ఆఫ్ లిబర్టీని బీట్ చేసిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ

స్టాట్యూ ఆఫ్ లిబర్టీని బీట్ చేసిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ
X

అమెరికాలోని న్యూయార్క్ లో ఉండే ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ స్వేచ్చకు ప్రతీక. భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో ఉండే ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఐక్యతకు ప్రతీక. ఇప్పుడు మరోసారి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వార్తల్లో ఎక్కింది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఉండే స్టాట్యూ ఆఫ్ లిబర్టీని గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దాటేసింది. అమెరికాలోని ఆ స్వేచ్చా చిహ్నానికి 133 సంవత్సరాలు చరిత్ర ఉంటే..మన ఐక్యతా విగ్రహాం ఈ మధ్యే ఏడాది పూర్తి చేసుకుంది. కానీ ఇఫ్పుడు ప్రతి రోజూ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించేందుకు ఏకంగా 15000 మంది పర్యాటకులు వస్తున్నారు.

విగ్రహాం ప్రారంభించిన 2018 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 74 శాతం మేర పెరిగినట్లు అధికార వర్గాలు చెబుతన్నాయి. సగటున ప్రతి రోజూ యూనిటీ విగ్రహా సందర్శనకు 15000 మంది వస్తుండగా..ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సందర్శనకు వచ్చే వారి సంఖ్య రోజుకు 10000 మంది మాత్రమే అని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో పలు చిన్న చిన్న సంస్థానాలను దేశంలో సంఘటితం చేసిన ప్రముఖ భారతీయ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకునేందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it