Telugu Gateway
Latest News

పది నెలల్లో లక్ష ఉద్యోగాలు ఔట్

పది నెలల్లో లక్ష ఉద్యోగాలు ఔట్
X

దేశ ఆటోమొబైల్ పరిశ్రమ గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి సంక్షోభాన్ని ఎదుర్కొంది. అగ్రశ్రేణి కంపెనీల దగ్గర నుంచి అన్నికంపెనీల కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆయా కంపెనీలు ఉత్పత్తిని కూడా అదే స్థాయిలో తగ్గించాయి. 2018 అక్టోబర్-2019 జూలై మధ్య కాలంలో ఆటో కాంపొనెంట్ పరిశ్రమలో ఏకంగా లక్ష మంది తాత్కాలిక కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు ఆటోమోటివ్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) వెల్లడించింది.

అంటే పది నెలల కాలంలో ఏకంగా లక్ష ఉద్యోగాలు కోల్పోవటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అదే సమయంలో పరిశ్రమ టర్నోవర్ లో కూడా ఏకంగా 10.1 శాతం క్షీణత నమోదు అయింది. ఈ కాలంలో టర్నోవర్ 1.79 లక్షల కోట్ల రూపాయలు అని ఏసీఎంఎ తెలిపింది. అయితే పరిశ్రమ మాత్రం ఆటో కాంపోనెంట్ పరిశ్రమపై ఏకమొత్తంగా 18 శాతం జీఎస్ టీ ఉండాలని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపాక్ జైన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story
Share it