ఎయిర్ లైన్స్ ‘డిస్కౌంట్ల సీజన్’ స్టార్ట్

ఎయిర్ లైన్స్ లో మళ్ళీ డిస్కౌంట్ల సీజన్ స్టార్ట్ అయింది. సహజంగా జనవరి-మార్చి మధ్య కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండదు. కారణంగా పిల్లలకు పరీక్షల సమయం దగ్గర పడటంతో పాటు..కార్పొరేట్ పరంగా చూస్తే కూడా ఆర్ధిక సంవత్సరాం కూడా కావటంతో ప్రయాణాలు కూడా తగ్గుముఖం పడతాయి. మార్చి తర్వాత మళ్లీ పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. అంతగా డిమాండ్ ఉండని సమయంలో ఎలాగోలా కొన్ని సీట్లు అయినా అమ్ముకునేందుకు ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించటం సహజమే. దేశీయ విమానయాన రంగంలోని పలు ఎయిర్ లైన్స్ ఈపనిచేస్తాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇలాంటి ఆఫర్లతోనే ముందుకొచ్చింది. దేశీయ రూట్లతోపాటు విదేశీ రూట్లలోనూ ఆఫర్లు ప్రకటించారు. తాజాగా చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్లు అందిస్తోంది.
‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. డిసెంబర్ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని పేర్కొంది.