ఎంఐ 108 మెగాపిక్సెల్ ఫోన్ వచ్చేసింది
పండగల సమయంలో షావోమీ మొబైల్ ఫోన్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ బ్రాండ్లకు చెందిన ఫోన్లు ‘రికార్డు’ సమయంలో అమ్ముడుపోయాయి. ఇప్పుడు షావోమీ మరో సంచలనానికి తెరలేపింది. 108 మెగాపిక్సెల్ ఫోన్ వచ్చేసింది. అయితే ఇది భారత్ లోకి ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చైనాలో మాత్రం ఈ ఫోన్ ను మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఇది అద్భుతమైన కెమెరా ఫోన్ గా నిలవనుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్ ఫోన్‌ను నేడు బీజింగ్‌లోఆవిష్కరించారు.
ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అయితే ఇది త్వరలోనే భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఈ ఫోన్లకు ఇప్పుడు భారత్ అతి పెద్ద మార్కెట్ గా కూడా అవతరించిన సంగతి తెలిసిందే. నవంబర్ 11 నుంచి చైనాలో ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నయి. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. హువావే మేట్ 30 ప్రో, గెలాక్సీ నోట్ 10+, గూగుల్ పిక్సెల్ 4 ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని మొబైల్ నిపుణుల అంచనా.
ఎంఐ సీసీ 9 ప్రో ధర
బేసిక్ వేరియంట్ 6జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 28,000 రూపాయలు.
హై-ఎండ్ 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 31,000 రూపాయలు
ప్రీమియం ఎడిషన్ ధర 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు 35,000 రూపాయలు
ఎంఐ సీసీ 9 ప్రో స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) మి సిసి 9 ప్రో MIUI 11 ను నడుపుతుంది. ఈ ఫోన్‌లో
6.47-అంగుళాల కర్వ్‌డ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్
108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)
117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా,
2x ఆప్టికల్ జూమ్‌తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్
50x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 8 ఎంపీ లాంగ్ టెలిఫోటో లెన్స్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్
5260 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్