Telugu Gateway
Latest News

మొబైల్ ఛార్జీల మోత స్టార్ట్ డిసెంబర్ నుంచే

మొబైల్ ఛార్జీల మోత స్టార్ట్ డిసెంబర్ నుంచే
X

కొత్త సంవత్సరానికి ముందు మొబైల్ యూజర్లకు షాక్. దేశంలోని అగ్రశ్రేణి టెలికం కంపెనీలు అన్నీ వరస పెట్టి ఛార్జీలు పెంచటానికి రెడీ అయిపోయాయి. ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియాలు తమ ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి పెరగనున్నట్లు తెలిపాయి. వినియోగదారులకు అత్యాధునిక సేవలు అందించేందుకు వీలుగా మరింత మెరుగైన డిజిటల్ టెక్నాలజీని సమకూర్చుకోవటంతోపాటు వ్యాపారాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్లటానికి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ టెల్ కంటే ముందు వోడాఫోన్, ఐడియాలు ఛార్జీల పెంపు ప్రకటన చేశాయి.

అయితే ఈ సంస్థలు ఏవీ కూడా ఛార్జీలు ఎంత మేర పెంచనున్నది మాత్రం చెప్పకుండా కొత్త ఛార్జీలు ఎప్పటి నుంచో అమల్లోకి వస్తాయో ప్రకటన మాత్రం చేశాయి. ఇటీవలే జియో ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని అగ్రశ్రేణి టెలికం సంస్థలు అన్నీ భారీ నష్టాలను ప్రకటించాయి. అది ఎంతలా అంటే దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఎప్పుడూలేని రీతిలో ఈ నష్టాలు ఉన్నాయి. సవరించిన స్థూల ఆదాయం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికం కంపెనీలు ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో ప్రభుత్వం రక్షిస్తే తప్ప తాము సేవలు అందించటం కష్టమే అనే స్థాయిలో టెలికం కంపెనీలు ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నాయి. ఈ తరుణంలో అన్ని కంపెనీలు ఛార్జీల పెంపు ప్రకటన చేశాయి.

Next Story
Share it